News August 23, 2025

యూరియా డీలర్లతో కలెక్టర్ సమావేశం

image

యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రైవేట్ ఫర్టిలైజర్స్ డీలర్లను హెచ్చరించారు.
శుక్రవారం రాత్రి వ్యవసాయ, విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు, ఫర్టిలైజర్స్ డీలర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో దాదాపు 430 ప్రైవేట్ ఫర్టిలైజర్స్ షాపుల వద్ద యూరియా ఎరువుల వివరాలతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. JC అధితిసింగ్, DAO చంద్రానాయక్ పాల్గొన్నారు.

Similar News

News August 23, 2025

కడప: ‘దరఖాస్తులు తక్కువ వస్తే రుసుము వాపస్’

image

ఒక్కో బార్‌కు నాలుగు కన్నా తక్కువ ధరకాస్తులు వస్తే, దరఖాస్తు రుసుము రూ.5 లక్షలు వాపస్ చేస్తామని జిల్లా ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. అయితే ప్రాసెసింగ్ పీజు మాత్రం వెనక్కు ఇవ్వరన్నారు. వాటిని రద్దుచేసి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని టెండరు దారులు గుర్తించాలన్నారు. జిల్లాలో 29 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేసినట్లు వివరించారు.

News August 23, 2025

కడప జిల్లాలో యూరియా కొరతలేదు..!

image

కడప జిల్లాలో ఎక్కడైనా యూరియా కొరత ఉంటే 24 గంటల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం యూరియా లభ్యతపై JC అధితిసింగ్, DAO చంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతుల అవసరాలకు తగినంత యూరియా స్టాక్ ఉందన్నారు. ఒక ఎకరాకు ఒక బస్తా సరిపోతుందన్నారు. కావల్సినంత మాత్రమే వినియోగించాలని, యూరియా విషయంలో దళారులు తప్పుదోవపట్టిస్తే చర్యలు తప్పవన్నారు.

News August 23, 2025

చాపాడు PSను తనిఖీ చేసిన జిల్లా SP

image

చాపాడు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ  మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.