News August 28, 2025

యూరియా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి: వికారాబాద్ కలెక్టర్

image

యూరియా దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం యూరియా ఎరువులపై వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 20,124 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేశామని చెప్పారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News August 28, 2025

NLG: ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్లకు ఈనెల 30 చివరి తేదీ

image

నల్గొండ ఎన్జీ కాలేజీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 30వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929610, 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News August 28, 2025

హరిత నగరంగా అమరావతి

image

అమరావతిలో గ్రీనరీ అభివృద్ధి పనులను APCRDA, ADCL లు ప్రణాళికాయుతంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. పర్యాటకం, పర్యావరణ పరిరక్షణలతో కూడిన అనేక ప్రాజెక్టులను చేపట్టి, అమరావతిని భవిష్యత్తు తరాలకు ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే దిశగా సమగ్ర కృషి జరుగుతోంది. 4,716 హెక్టార్ల విస్తీర్ణంలో అమరావతిలో పర్యాటక నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వం, వినోదానికి కేంద్రంగా నిలుస్తుంది.

News August 28, 2025

VAD అంటే ఏంటి?

image

Vertebral artery dissection (VAD) అనేది వెన్నెముక ధమని లోపలి పొరల్లో సంభవించే చీలిక. ఈ ధమని మెదడుకు రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల్లో ఒకటి. VAD వల్ల రక్త ప్రవాహం తగ్గి స్ట్రోక్ రావొచ్చు. హైబీపీ, స్మోకింగ్, మైగ్రేన్ లాంటి కారణాలతో VAD వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, బలహీనత, మాట్లాడేందుకు ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాను VAD నుంచి కోలుకుంటున్నానని తెలంగాణ IAS <<17546623>>స్మిత<<>> ట్వీట్ చేశారు.