News August 19, 2025

యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

రైతులకు కాకుండా యూరియాను పక్కదారి పట్టిస్తే వ్యవసాయ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రంజిత్ భాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో యూరియా ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు అమ్మినా, లింకేజీలు పెట్టినా కేసులు తప్పవన్నారు. సరిహద్దు చెక్ పోస్ట్‌లలో విజిలెన్స్, పోలీస్, రవాణాశాఖ అధికారుల టీములతో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News August 20, 2025

ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కర్నూలు శివారులోని పెద్దపాడు నుంచి 44వ జాతీయ రహదారి హైదరాబాదుకు లింకు చేసే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ పి. రంజిత్ భాషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశహాలులో ఎస్పీతో కలిసి రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. కర్నూలులో కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు విస్తరణ, ఉల్చాల రోడ్డు సర్కిల్ పనులు వేగవంతం చేయాలన్నారు.

News August 19, 2025

తుంగభద్ర జలాశయం 26 గెట్లు ఎత్తివేత

image

ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల రైతులకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయం వరుస వర్షాల కారణంగా మంగళవారం నిండుకుండలా మారింది. దీంతో బోర్డు అధికారులు జలాశయం నుంచి 26 గేట్లను ఎత్తి దిగువన గల నదికి నీటిని విడుదల చేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో ఉన్న నీటి సామర్థ్యం 1,626 అడుగులుగా ఉంది.

News August 19, 2025

మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ భవనంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” పోస్టర్లను ఆవిష్కరించారు. జేడ్పీ సీఈఓ నాసర రెడ్డి, కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.