News September 8, 2025

యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: MHBD కలెక్టర్

image

యూరియా పంపిణీ కేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. జిల్లాలో యూరియా కేంద్రాల నిర్వహణ, యూరియా పంపిణీ శనివారం, ఆదివారం తీసుకున్న చర్యలపై కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార శాఖ సంబంధిత సిబ్బందితో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News September 8, 2025

TU: సోషల్ సైన్సెస్ డీన్‌గా ప్రొ.రవీందర్ రెడ్డి నియామకం

image

తెలంగాణ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ డీన్‌గా ప్రొ.రవీందర్ రెడ్డిని నియమిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి నియామక పత్రాన్ని అందజేశారు. ప్రొ.రవీందర్ రెడ్డి గతంలో అప్లయిడ్ ఎకనామిక్స్ విభాగం HOD, BOS ఛైర్మన్‌గా, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, వర్సిటీ చీఫ్ వార్డెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో వర్సిటీ పాలకమండలి సభ్యుడిగా కూడా పని చేశారు. ప్రస్తుతం NSS కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

News September 8, 2025

ఒకే ఫ్రేమ్‌లో పవర్, ఐకాన్, గ్లోబల్ స్టార్స్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో దర్శనమిచ్చారు. అల్లు అరవింద్ అమ్మ కనకరత్నం పెద్ద కర్మ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. చిరంజీవి దంపతులూ హాజరయ్యారు. ఈ ఫొటోలను గీతా ఆర్ట్స్ షేర్ చేసింది. కనకరత్నం ఆశీస్సులు తమపై ఉంటాయని పేర్కొంది. కాగా తమ అభిమాన హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

News September 8, 2025

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: భూపాలపల్లి ఎస్పీ

image

ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో మొత్తం 15 వినతి పత్రాలు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును ఎస్పీ స్వయంగా పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.