News September 8, 2025
యూరియా లోటు లేదని రైతులకు తెలియజేయాలి: కలెక్టర్

జిల్లాలో యూరియా లోటు లేదనే విషయాన్ని రైతులకు అర్థం అయ్యేలా తెలియజేయాలని కలెక్టర్ అంబేడ్కర్ సిబ్బందికి తెలిపారు. సోమవారం PGRS అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. మొదటి విడత పంపిణీ ఇంచుమించు పూర్తి చేసామన్నారు. 2వ విడత కూడా 30 శాతంపై బడి పూర్తి చేసామని వివరించారు. మిగిలినవి వారం లోగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రెండో విడతకు ఇండెంట్ పెట్టామన్నారు. యూరియా వచ్చిన వెంటనే అందజేస్తామన్నారు.
Similar News
News September 9, 2025
VZM: ‘ఎరువులు అక్రమ నిల్వలు చేస్తే చర్యలు తప్పవు’

ఎరువులు అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 11 మంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రానున్న 3 రోజుల్లో ఓ కంపెనీ ద్వారా 1,000 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ కంపెనీ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు వస్తాయన్నారు. వీటిని 25వ తేదీ లోపు అందజేస్తామన్నారు.
News September 9, 2025
మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత ప్రచారం: VZM ఎస్పీ

మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పం ప్రచార రథం ద్వారా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. క్షేత్ర స్ధాయిలో ‘సంకల్ప రథం’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువతతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News September 9, 2025
ఎస్.కోట: ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

ఎస్.కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ స్థానిక వన్ వే రోడ్డుపై నడిచి వెళుతున్న వల్లయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.