News December 20, 2025
యూరియా సరఫరాకు ప్రత్యేక మొబైల్ యాప్: కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకువచ్చిందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రబీ సీజన్ దృష్ట్యా ఈ ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ను డిసెంబర్ 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడకుండా యూరియా పొందవచ్చని పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
రంపచోడవరం: కొత్త జిల్లాకు పరిపాలనకు అవసరమైన భవనాలు కష్టమే.?

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా పేరిట నూతన జిల్లాకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రంపచోడవరం కేంద్రంలో పరిపాలన కోసం అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు కష్టతరంగా ఉండనుంది. ప్రస్తుతానికి వైటీసీ, పీఎంఆర్సీ భవనాలలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని శాఖల కార్యాలయాలకు భవనాలు ఏర్పాటు స్థానిక అధికారులకు తలనొప్పిగా మారనుంది.
News December 29, 2025
కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దారుకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి

కాల్వ శ్రీరాంపూర్ మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పుల్లూరు జగదీశ్వర్ రావుకి అతి తక్కువ కాలంలోనే డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఇది శుభ పరిణామమని, ఈ పదోన్నతి వారి సేవలకు బహుమానంగా భావిస్తూ ఈ సందర్భంగా మండల విద్యాధికారి సిరిమల్లె మహేష్ వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో ప్రజలకు సేవలందిస్తూ.. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
News December 29, 2025
నాగర్ కర్నూల్‌లో నేటి ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను అదనపు కలెక్టరు పి.అమరేందర్, దేవ సహాయంతో కలిసి కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


