News August 23, 2025
యూరియా సరఫరా సజావుగా జరగాలి: కలెక్టర్

దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. యూరియా అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం సంఘం ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, సహకార సంఘం అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News August 23, 2025
KNRలో రేపు జిల్లాస్థాయి యోగాసన పోటీలు

జూనియర్ విభాగాల్లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు రేపు నిర్వహించనున్నట్లు TG యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ KNR యూనిట్ కన్వీనర్ ఎం.రమేష్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారిని SEPలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ట్రెడిషనల్ యోగా, ఫార్వర్డ్ బైండ్, బ్యాక్ బెండ్ తదితర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు శనివారం సా.6 గం.లోపు 8522920561ను సంప్రదించాలన్నారు.
News August 23, 2025
కంటిచూపు కోల్పోయిన హోంగార్డుకి సీపీ సాయం

విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన ఓ హోం గార్డుకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అండగా నిలిచారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ హై బీపీ కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని సీపీ శుక్రవారం అందించారు. ప్రస్తుతం శివకుమార్‌కు కంటిచూపు వచ్చింది. కాగా, ఆయన నిన్ననే తిరిగి విధుల్లో చేరారు.
News August 23, 2025
హుజురాబాద్: జోరుగా చేరికల పరంపర

HZB నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర మొదలైంది. జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు HZB MLA కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో BRSలో చేరగా.. మరోవైపు ఇదే మండలంలోని ఫ్యాక్స్ చైర్మన్, ఓ మాజీ సర్పంచ్ ప్రణవ్ సమక్షంలో కాంగ్రెసులో చేరారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే చేరికలు మొదలవడంతో నాయకులు ఏరోజు ఏ పార్టీలో ఉంటారో తెలియదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.