News February 10, 2025
యూసఫ్‌కు మంత్రి అభినందనలు

తన ప్రతిభతో అన్నమయ్య జిల్లాకు భారత షూటింగ్ బాల్ క్రీడాకారుడు మహమ్మద్ యూసుఫ్ మంచిపేరు తీసుకు వచ్చారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌ఛార్జ్ జయచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో మంత్రిని రాయచోటిలో యూసఫ్ కలిశారు. శాలువా, పూలమాలలతో యూసఫ్‌ను సన్మానించారు. భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని విజయాలను అందించాలని ఆకాంక్షించారు. యూసఫ్ వంటి క్రీడాకారులను తయారు చేయాలన్నారు.
Similar News
News November 8, 2025
జగిత్యాల జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కనిష్ఠంగా మన్నెగూడెంలో 15.0℃, రాఘవపేట 15.1, గోవిందారం 15.2, కథలాపూర్ 15.3, ఐలాపూర్, మల్లాపూర్ 15.4, జగ్గసాగర్ 15.6, రాయికల్ 15.7, పుడూర్, మద్దుట్ల, కోరుట్ల 15.8, గొల్లపల్లె, మల్యాల, గోదూరు 15.9, పొలాస, పెగడపల్లె 16.2, మేడిపల్లి 16.3, సారంగాపూర్, నేరెల్ల 16.4, జగిత్యాల, తిరమలాపూర్ 16.5, మెట్పల్లె, అల్లీపూర్ 16.6, బుద్దేష్‌పల్లిలో 16.8℃గా నమోదైంది.
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
జిల్లా స్కిల్ పోటీల్లో ఏల్చూరు ZPHSకు రెండో స్థానం

బాపట్ల జిల్లా స్థాయిలో జరిగిన ఐటీ, ఐటీఈఎస్, ఆటోమోటివ్ పోటీల్లో ఏల్చూరు ZPHS విద్యార్థులు ప్రతిభ చాటారు. ఐటీ, ఐటీఈఎస్ విభాగంలో విద్యార్థులు రూపొందించిన ఏఐ మోడల్ ప్రాజెక్టుకు రెండో స్థానం దక్కింది. ఈ సందర్భంగా HM మాధవి పుష్పమి అధ్యక్షతన విద్యార్థులు అన్విత, నరేష్, సులేమాన్, హర్షవర్ధన్, విష్ణు, భరత్, శేఖర్‌లతో పాటు ట్రైనర్స్ నాగశ్రీను, నరేంద్రలను టీచర్లు బృందం ప్రత్యేకంగా అభినందించారు.


