News November 8, 2025
యూ.కొత్తపల్లి: మైనర్ బాలిక ఫిర్యాదు.. వ్యక్తి అరెస్ట్

యూ.కొత్తపల్లి మండలానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో అంజిబాబు అనే యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తాను గర్భం దాల్చన తర్వాత పెళ్లికి నిరాకరించాడని బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 8, 2025
తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 8, 2025
గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
News November 8, 2025
ఎటపాక: ఉసురు తీసిన చీటీల అప్పులు

అప్పుల బాధతో చీటిల వ్యాపారి గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల మేరకు..ఎటపాకకు చెందిన బాల్యా(60) పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. రూ. కోట్లలో అప్పుల పాలవడంతో ఈ సూసైడ్‌కు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.


