News September 26, 2025
యోగి వేమన యూనివర్షిటీలో 5 ఏళ్ల జియాలజీకి ప్రవేశాలు

యోగి వేమన విశ్వవిద్యాలయంలోని ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకుడు డా. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ ఇంటర్మీడియట్ విద్యార్థులు దీనికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్షిటీని సంప్రదించాలన్నారు.
Similar News
News September 26, 2025
కడప: కానిస్టేబుల్స్ శిక్షణ ఏర్పాట్ల పరిశీలన

ఇటీవల ఎంపికైన కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈక్రమంలో కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ విశ్వనాథ్ శుక్రవారం పరిశీలించారు. వసతి, తరగతి గదులు, మైదానాన్ని చెక్ చేశారు. అనంతరం మొక్కల నాటి నీరు పోశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) ప్రకాశ్ బాబు, ఇతర ఉన్నత అధికారులు ఎస్పీ వెంట ఉన్నారు.
News September 26, 2025
కడప: రైతులారా.. మీకు ఈ విషయం తెలుసా?

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్లతోటల పెంపకానికి 100% రాయితీ ఇస్తున్నామని కడప జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి తెలిపారు. ఈనెలాఖరు వరకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద మామిడి, జామ, నిమ్మ పంటలు సాగు చేసుకోవచ్చన్నారు.
News September 26, 2025
7న పుష్పగిరిలో గిరిప్రదక్షణ

కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరిలో అక్టోబర్ 7వ తేదీన గిరిప్రదక్షణ జరగనుంది. సంబంధిత కరపత్రాలను పుష్పగిరి తీర్థయాత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సట్టి భారవి సిద్ధవటం జ్యోతిక్షేత్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.