News March 22, 2026

‘యో సూస్కోబఢ్లా’.. ‘ధురంధర్-2’ సీన్‌లో కెమెరామ్యాన్!

image

బాక్సాఫీసును షేక్ చేస్తున్న ధురంధర్-2 ఇప్పుడు ఓ సిల్లీ రీజన్‌కు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఓ ఫైట్ సీన్‌లో కెమెరామ్యాన్ కనిపించడంతో ఆ క్లిప్ ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. దీంతో ఇన్నిరోజులు ‘పీక్ డీటైలింగ్’ అంటూ దర్శకుడు ఆదిత్యధర్‌ను ఎత్తేసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారంటూ ట్రోల్ చేస్తున్నారు. అది చిన్న తప్పే అయినా సీన్‌లో అది స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

Similar News

News April 5, 2026

SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

image

SRHతో మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సలీల్ స్థానంలో లివింగ్‌స్టోన్, పైన్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు.

SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, ఉనద్కత్, శివాంగ్ కుమార్.
LSG: మార్ష్, పంత్ (C), మార్క్రమ్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్దార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్.

News April 5, 2026

షిన్రిన్-యోకు: స్ట్రెస్‌ను దూరం చేసే జపనీస్ టెక్నిక్

image

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కామన్ అయిపోయిన స్ట్రెస్‌ను దూరం చేసుకునేందుకు జపాన్ వాసులు ‘షిన్రిన్-యోకు’ అనే సహజ ప్రక్రియను అనుసరిస్తున్నారు. షిన్రిన్-యోకు అంటే ప్రకృతి ఒడిలో నిమగ్నమవ్వడం. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, మట్టి వాసనలను ఆస్వాదిస్తూ గడపడమే ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇలా ప్రకృతితో మమేకమైతే మానసిక ఆందోళనలు దూరమై శారీరకంగా, మానసిక‌ంగా ప్రశాంతత లభిస్తుందని జపాన్ వాసుల విశ్వాసం.

News April 5, 2026

దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు

image

*వివేక్ ఎక్స్‌ప్రెస్: దిబ్రూగఢ్ (అస్సాం) నుంచి కన్యాకుమారి. 4,154 కి.మీ 75 గంటల్లో ప్రయాణిస్తుంది
*అరోనై ఎక్స్‌ప్రెస్: సిల్చార్ (అస్సాం) నుంచి తిరువనంతపురం. 3,916 కి.మీ.
*హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్: కన్యాకుమారి నుంచి కత్రా(J&K). 3,789 కి.మీ.
*తిరునెల్వేలి జమ్మూ ఎక్స్‌ప్రెస్: తిరునెల్వేలి (TN) నుంచి కత్రా. 3,642 కి.మీ.
*న్యూ టిన్సుకియా: న్యూ టిన్సుకియా (అస్సాం) నుంచి బెంగళూరు. 3,642 కి.మీ.