News January 8, 2026

రంగంపల్లి వీ-హబ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నిర్మాణంలో ఉన్న వీ-హబ్ నూతన భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. శిక్షణకు అవసరమైన ఫర్నిచర్, పరికరాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పర్యటనలో డీఆర్‌డీఓ కాళిందిని, పంచాయతీరాజ్ ఏఈ పవన్ పాల్గొన్నారు.

Similar News

News February 21, 2026

KMR: పార్టీ నాయకులు, కార్యకర్తలు రావొద్దు: ఎమ్మెల్యే

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. అయితే ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులను శిశు మందిర్ వద్దకు శనివారం 10గంటలకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు సైతం సవాలు స్వీకరించారు. కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రావొద్దని తానే తేల్చుకుంటానని ఎమ్మెల్యే పార్టీ శ్రేణులను కోరారు.

News February 21, 2026

ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

image

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.

News February 21, 2026

ప్రీ మెచ్యూర్ బేబీల సంరక్షణ ఇలా..

image

ప్రీమెచ్యూర్ బేబీల సంరక్షణలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి పాలు పట్టడంతో పాటు బర్పింగ్ చేయించడం ముఖ్యం. సరైన నిద్ర కోసం అనువైన వాతావరణం సృష్టించాలి. వారికి రోజూ స్నానానికి బదులు స్పాంజ్ బాత్ చేయించాలి. వీరికి ఇన్ఫెక్షన్ల ముప్పూ ఎక్కువే. అలాగే వీరికి ఆరు నెలలు వచ్చేవరకు ప్రయాణాలు కూడా సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.