News November 30, 2025

రంగారెడ్డి: అన్నా.. ఏమైనా డబ్బులు ఉన్నాయా!

image

రంగారెడ్డి జిల్లాలోని 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం వ్యవసాయ భూమి, ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. కాగా, అన్నా.. సర్పంచ్ రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఏమైనా డబ్బులు ఉన్నాయా..! నేను గెలిస్తే నీవు గెలిచినట్టే అని పంచాయతీ పోటీదారులు అప్పులు చేస్తున్నారు.

Similar News

News February 20, 2026

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

image

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.

News February 20, 2026

HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

image

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.