News July 29, 2024

రంగారెడ్డి: ఈ-ఆఫీస్‌ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

image

RR కలెక్టరేట్‌లో త్వరలోనే ఈ-ఆఫీస్‌ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న సేవలు.. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా సాగనున్నాయి. పాలనలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్‌ శశాంక వీలైనంత త్వరగా ఈ-ఆఫీస్‌ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి సాంకేతిక నైపుణ్యంపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు.

Similar News

News November 6, 2025

హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

image

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్‌తో జరిగే ఈవెంట్‌లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

News November 6, 2025

HYD: గోపి నా పెద్దకొడుకని అక్షరను హత్తుకున్న అవ్వ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రహమాత్‌నగర్‌లోని ఫాతిమా నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో ఓ అవ్వ ‘గోపీ నా పెద్ద కొడుకు అని గుర్తు తలుచుకుంటూ.. నా మనుమరాలు అని ఆప్యాయంగా అక్షరను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా దీవించారు. మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంటెపాక నరేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

News November 6, 2025

HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

image

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.