News October 7, 2025
రంగారెడ్డి: ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న ఆశావహులు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు కొద్ది సంవత్సరాలుగా పట్టణాల్లో నివాసముంటున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో గ్రామాల బాట పట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Similar News
News October 7, 2025
రంగారెడ్డి జిల్లా పరిషత్ పీఠం ఎవరికి దక్కేనో..?

రంగారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలోని కందుకూరు, షాబాద్ మండలాల్లో ఎస్సీ మహిళలకు రిజర్వ్డ్ కావడంతో అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంది.
News October 6, 2025
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: రంగారెడ్డి కలెక్టర్

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో నోడల్, పోలింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, పోలీసులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించిన అధికారులు పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.
News October 6, 2025
రంగారెడ్డి: బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటోంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్తల వరకు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరఫున బీఫామ్ అందజేయనుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావాహుల పేర్లను నమోదు చేసుకుంటోంది.