News November 19, 2025
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అక్రిడియేషన్ కార్డుల జాప్యం, జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ అమలు చేయకపోవడం, పలు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోలేదని ఆందోళనకారులు పేర్కొన్నారు.
Similar News
News February 23, 2026
RR: ఉగ్గుపాల నుంచే ఒగ్గు కథల వైపు మల్లారి!

ఒగ్గు కథ చెప్పడం మగాళ్లకే పరిమితమైన రోజుల్లో ఓ మహిళ కథ చెప్పడానికి బయలుదేరింది. రంగారెడ్డి(D),యాచారం(M), నక్కర్త మేడిపల్లికి చెందిన జమ్మ మల్లారి. ఈమె వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి, ఒగ్గు కథలు వినిపించి ఒగ్గుకథ ‘సూపర్‌స్టార్’గా ఎదిగారు. జీవితాన్ని ఒగ్గుకథకు అంకితం చేసి తొలి మహిళా ఒగ్గు కథా కళాకారిణిగా పేరుగాంచి 2020లో విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుని FEB 7న ఆమె శివైక్యం చెందారు.
News February 23, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు 200 కేంద్రాలు..!

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో 200 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంక్యానాయక్ తెలిపారు. 84,301 మంది ప్రథమ సంవత్సరం, 70,171 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News February 21, 2026
RR: వారికి 100% రాయితీతో రూ.60వేలు

రాళ్లు కత్తిరించే వృత్తిలో అనుభవం ఉన్న ముస్లింలకు పునరావాసం, జీవనోపాధి కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుడికి రూ.60 వేల చొప్పున, రూ.10 వేల విలువైన టూల్ కిట్, రూ.50 వేల విలువైన జనరేటర్‌ను 100% సబ్సిడీ కింద అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 1 వరకు http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


