News December 10, 2025

రంగారెడ్డి జిల్లా మహిళలకు ఫ్రీ టైలరింగ్‌

image

SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ చిలుకూరులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహిళలకు వసతి, భోజనం సౌకర్యంతో టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణాకాలం 30 రోజులు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు గురువారం సంస్థ కార్యాలయంలో గానీ లేదా ఫోన్ నం.85001 65190 ద్వారా పేరును నమోదు చేసుకోవాలని సంస్థ సంచాలకుడు మహమ్మద్ అలీఖాన్ సూచించారు.

Similar News

News December 15, 2025

కాంగ్రెస్ “ఓట్ చోరీ” సభ అట్టర్ ఫ్లాప్: కిషన్ రెడ్డి

image

“ఓట్ చోరీ” పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన <<18562660>>సభ<<>> అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ అంటూ దుష్ప్రచారానికి తెరతీశారన్న విషయం ప్రజలకు అర్థమైంది. కార్యకర్తలను బిజీగా ఉంచుకోవడానికి మాత్రమే ఈ ట్రిక్కులు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ సభ్యులను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

News December 15, 2025

ఒక్క ఓటుతో కొత్తపల్లి సర్పంచ్‌గా గెలిచిన శోభారాణి

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా గోదరి శోభారాణి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శోభారాణి తన ప్రత్యర్థి ఎల్కతుర్తి కనకలక్ష్మిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

News December 15, 2025

వలిగొండలో ఉత్కంఠగా సాగిన కౌంటింగ్.. గెలిచిందెవరంటే?

image

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వెంకట పాపిరెడ్డి ప్రత్యర్థి BRS బలపరిచిన పలుసం రమేశ్ గౌడ్‌పై 472 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచాలు, మిఠాయిలతో సంబరాలు జరుపుకున్నారు. మొత్తం 7,212 ఓట్లు ఉండగా కాంగ్రెస్, BRS మధ్య నెక్ టూ నెక్ ఫైట్ సాగింది.