News October 6, 2025
రంగారెడ్డి: తాగి వస్తున్నాడని తండ్రిని చంపేశాడు..!

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామర్లపల్లిలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని చంపేశాడు. తన తండ్రి మద్యం తాగి ఇంటికి వచ్చి రోజు గొడవ చేస్తున్నాడని దీంతో కోపం వచ్చి కొట్టి చంపానని చెప్పాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 7, 2025
HYD: ‘108’లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

108 అంబులెన్స్‌లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని HYD జిల్లా మేనేజర్ నవీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ ఉద్యోగానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జ్ నంబర్ కలిగి ఉండాలన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈనెల 7న మంగళవారం కింగ్ కోఠీలోని GOVT ఆసుపత్రి 108 ఆఫీస్‌లో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 9100799259, 9676120894 నంబర్లకు కాల్ చేయాలన్నారు.
News October 7, 2025
జూబ్లీహిల్స్‌లో బస్తీ యాత్ర చేపడతాం: టీపీసీసీ చీఫ్

HYD జూబ్లీహిల్స్‌లో బస్తీ యాత్ర చేపడతామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం HYDలో ఆయన మాట్లాడారు. ఈ యాత్రలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తోపాటు ముగ్గురు మంత్రులు పాల్గొంటారని వెల్లడించారు. అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ రేసులో లేరని, ఆయన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవుతారని తెలిపారు. ఎంఐఎం మద్దతు ఇంకా స్పష్టంగా లేదని పేర్కొన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. మీ కామెంట్?
News October 7, 2025
HYD: ఇక.. ఆర్టీసీ డ్రైవర్లకు సీటు బెల్ట్ తప్పనిసరి..!

HYD నగరం సహా రాష్ట్రంలోని అనేక డిపోల పరిధిలో అన్ని ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్లకు సీటు బెల్టులు పెట్టుకోవడం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో బస్సుల్లో డ్రైవర్ సీట్లు, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ సీట్లకు సీటు బెల్టులు అమరుస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. త్వరలోనే మిగతా ప్రాంతాలకు సైతం ఈ నిబంధన విస్తరిస్తామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.