News December 19, 2025
రంగారెడ్డి: పల్లే పోరులో బీసీలదే హవా!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన GP ఎన్నికల్లో బీసీ అభ్యర్థులదే హవా కొనసాగింది. జనరల్ స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 525 జీపీలకు 92 స్థానాలు బీసీలకు కేటాయించగా 198 బీసీ అభ్యర్థులు విజయం సాధించారు. జనరల్ స్థానాల్లో 106 మంది గెలుపొందారు. VKBలో 594 జీపీలకు107 స్థానాలకు 219 స్థానాల్లో గెలుపొందారు. 112 జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు సత్తాచాటారు.
Similar News
News December 21, 2025
నేషనల్స్‌లో బాపట్ల జిల్లా యువకుడి సత్తా.!

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈనెల 16 నుంచి 20 వరకు నిర్వహించిన బంగ్లాదేశ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చీరాల యువకుడు విజయం సాధించాడు. మెన్స్ సింగిల్స్ విభాగంలో యువకుడు షేక్ నోమాయెర్ ద్వితీయ స్థానాన్ని సాధించాడు. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన షేక్ నోమాయెర్ రన్నరప్‌గా నిలిచి 850 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.
News December 21, 2025
ఘన జీవామృతం ఎలా వాడుకోవాలి?

తయారుచేసిన ఘనజీవామృతాన్ని వారం రోజుల్లో పొలంలో వెదజల్లి, దుక్కి దున్నవచ్చు. నిల్వ చేసుకొని వాడాలనుకుంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనెసంచులలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడాలి. ఒకసారి తయారుచేసిన ఘనజీవామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎకరాకు దుక్కిలో 400kgల ఘనజీవామృతం వేసుకోవాలి. పైపాటుగా మరో 200kgలు వేస్తే ఇంకా మంచిది. దీని వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం, పంట దిగుబడి పెరుగుతుంది.
News December 21, 2025
ఇళ్ల ధరలు 5+ శాతం పెరిగే ఛాన్స్!

నూతన ఏడాదిలో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. భారీ డిమాండ్ దృష్ట్యా గృహాల ధరలు 5 శాతానికి పైగా పెరగొచ్చని 68% మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేసినట్లు క్రెడాయ్-CRE మ్యాట్రిక్స్ సర్వే వెల్లడించింది. ‘10% వరకు రేట్లు పెరగొచ్చని 46%, 10-15% పెరుగుతాయని 18% మంది అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించడంపై దృష్టిపెడుతున్నాం’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ తెలిపారు.


