News October 1, 2025

రంగారెడ్డి: ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలి: కలెక్టర్

image

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని రాజకీయ నేతల ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 1, 2025

రంగారెడ్డి: ‘స్థానిక’ పల్లకిలో ఓటర్లలో ఆశలు

image

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పోటీలో ఉండాలనుకునే ఆశావాహుల నుంచి సహజంగానే ఓటర్లు ఎంతో కొంత ఆశిస్తుంటారు. ప్రచారంలో భాగంగా రోజు వెంట వచ్చే కార్యకర్తలు, ముఖ్య నాయకులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అన్‌అఫిషియల్‌‌గా రాత్రి మద్యం సరఫరా చేయాల్సిందే. అసలే ఎన్నికల సమయం కావడంతో అడిగిన వాళ్లకు కాదంటే తమకు ఓటు వేయబోరనే భయంతో అడింది కాదనలేకపోతున్నట్లు తెలుస్తోంది.

News October 1, 2025

రంగారెడ్డి ‘లోకల్‌’లో టఫ్ ఫైట్

image

రంగారెడ్డి జిల్లాలో 21 ZPTC , 230 MPTC, 526 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ZPTC స్థానాలకు 200- 210 మంది వరకు, MPTC స్థానాలకు 2,300 మంది వరకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ గుర్తులకు అతీతంగా నిర్వహించే ఒక్కో సర్పంచ్ స్థానానికి కనీసం ముగ్గురు- నలుగురు అభ్యర్థులు చొప్పున 2,000 మంది వరకు పోటీలో ఉండనున్నట్లు సమాచారం. ఇక వార్డులకు పోటీచేసే వారి సంఖ్య ఓ అంచనాకు రాలేదు.

News September 30, 2025

రంగారెడ్డి జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు

image

రంగారెడ్డి జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలు, 230 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్‌లో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా.. 4,668 వార్డులు ఉన్నాయి. కాగా, రంగారెడ్డి జిల్లాలో ఫేజ్-1,2 విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.