News June 11, 2024

రంగారెడ్డి: బడి బస్సులపై నజర్ 

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 11,922 బడి బస్సులు ఉండగా… ఇప్పటివరకు 8,917 బస్సులు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందాయి. మరో 3,005 బస్సులకు సామర్ధ్య నిర్ధారణ కాలేదని DTC చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. 15 ఏళ్ల సర్వీస్ దాటిన బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగరాదని స్పష్టం చేశారు. ఇలాంటి బస్సుల్లో పిల్లలను తీసుకెళ్తే వెంటనే సీజ్ చేసి యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News September 22, 2024

28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News September 22, 2024

HYDలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు: కమిషనర్

image

గణేశ్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. శనివారం జోనల్ కమిషన్లు, అడిషనల్ కమిషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు నగరంలోని వీధుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

News September 22, 2024

RRR సౌత్ అలైన్‌మెంట్ ఖరారుకు ప్రత్యేక కమిటీ

image

HYD శివారులో RRR దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఖరారు చేసేందుకు 12 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. RR, VKB జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీలు భాగంగా ఉంటారు. వీరితో పాటుగా ఇతర జిల్లాల కలెక్టర్లు, R&B, NHAI అధికారుల బృందం కలిసి విస్తృతంగా అధ్యయనం చేపట్టనుంది.