News May 25, 2024

రంగారెడ్డి: మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

SC గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ CEO విద్యాలయాల్లో జూనియర్ ఇంటర్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి శుక్రవారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. MPC, బైపీసీ, MEC, సీఈసీ, HEC, వృత్తివిద్య కోర్సుల్లో సీట్లు ఉన్నాయని చెప్పారు.

Similar News

News September 14, 2025

HYD: హనీ ట్రాప్‌లో యోగా గురువు

image

చేవెళ్లలో యోగా గురువు రంగారెడ్డిని హనీ ట్రాప్ చేశారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసి ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉంటూ వీడియోలు తీశారు. ఇవి ప్రధాన నిందితుడు అమర్‌కు చేరగా.. అతడు బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఇప్పటికే రంగారెడ్డి నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారు. మరో రూ.2 కోట్లు కావాలని వేధించడంతో బాధితుడు గోల్కొండ PSలో ఫిర్యాదు చేయగా హనీ ట్రాప్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.

News September 14, 2025

దానం రాజీనామాకు ముందు జూబ్లీ ప్లాన్!

image

MLA దానం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రయత్నాలు ముమ్మరం చేశారు. AICC కీలక నేతతో టికెట్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో దానం నాగేందర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఆయన కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడంతో ఫిరాయింపు స్పష్టం కానుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో దానంను రాజీనామా చేయించాలని ఇటీవల CM, స్పీకర్, PCC చీఫ్ చర్చించారు. ఇక దానం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

News September 14, 2025

గూగుల్ తల్లే.. ‘గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే’కు ఆధారం

image

గూగుల్ మ్యాప్.. మనం ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళ్లడానికి దీనిపైనే ఆధారపడతాం. అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గూగుల్ తల్లినే నమ్ముకున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుందనే విషయంపై గూగుల్ మ్యాప్ ఆధారంగా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ రోడ్డు దాదాపు 210 నుంచి 230 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.