News December 14, 2025
రంగారెడ్డి: 2nd ఫేజ్.. సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం

రంగారెడ్డి జిల్లాలో నేడు రెండవ విడతలో భాగంగా సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. శంకర్‌పల్లి 24, మొయినాబాద్ 19, చేవెళ్ల 25, షాబాద్ 41, ఆమనగల్లు 13, కడ్తాల్ 24, తలకొండపల్లి 32 GPలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన GPలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఫలితాల కోసం Way2Newsను చూడండి.
SHARE IT
Similar News
News February 20, 2026
రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ తనిఖీలు.. భారీగా గంజాయి స్వాధీనం

రాచకొండలో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్ చేపట్టి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో పాత నేరస్థుడు ఖాజా వహాబుద్దీన్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 43 కేసుల్లో నిందితుడైన ఇతడు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత 20 రోజుల్లోనే ఈగిల్ ఫోర్స్ టీమ్ 225 మందిని అరెస్ట్ చేసింది.
News February 20, 2026
HYD: లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన విద్యాశాఖ అధికారులు!

స్కూల్ CBSE NOC ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సూపరింటెండెంట్ సంగీత ఫణిరాజ్, రంగారెడ్డి డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులను నాంపల్లి ACB కోర్టులో హాజరుపరిచారు.