News April 7, 2024

రంగును బట్టి రాజకీయాల్లోకి లాగొద్దు: ఏసీ

image

బ్లూ షర్ట్ వేసుకున్నానని వైసీపీ, పసుపు కండువా కప్పుకున్నానని టీడీపీ, రోజూ బొట్టు పెట్టుకుంటానని బీజేపీ అనొద్దని, తనకు రాజకీయాలు అంటగట్టొద్దని దివంగత ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. మహానాయకులు , పెద్దనాయకులు చాలా మంది ఉన్నారన్నారు. నెల్లూరు కోటమిట్టలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News

News October 4, 2025

సత్తా చాటిన ముత్తుకూరు యువకులు

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన క్రీడాకారులు టెన్నిస్ బాల్ T10 అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత్ తరఫున ప్రకాశ్, నాగేంద్ర ఎంపికయ్యారు. డిసెంబర్ 25 నుంచి 31 వరకు థాయిలాండ్ జరగబోయే సెకండ్ ఏసియన్ టెన్నిస్ బాల్ T10 క్రికెట్ ఛాంపియన్షిప్‌లో పాల్గొంటారు. వీరు ఇంతకుముందు ఒరిస్సాలో సెప్టెంబర్ 9న జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనపరిచారు.

News October 4, 2025

సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్‌

image

జిల్లాలో సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, చెరువుల్లో సాగునీటి నిల్వలు, ఇరిగేషన్‌ పనుల మరమ్మతులపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున అన్ని మేజర్‌, మైనర్‌ చెరువులను 50 శాతానికి పైగా నీటితో నింపాలన్నారు.

News October 3, 2025

గూడూరు బస్టాండ్లో దిన దిన గండం

image

కీలకమైన గూడూరు బస్టాండ్ ప్రయాణికుల పాలిట దిన దిన గండంగా మారింది. ప్రయాణికులు వేచి చోట ఉండే స్లాబులు పెచ్చులూడుతున్నాయి. కమ్ములు బయటపడి ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పైన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. RTC ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిన పట్టించుకోవడం లేదు. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది.