News April 29, 2024
రంజన్ల తయారీకి ఆదిలాబాద్ పెట్టింది పేరు..!

ఆదిలాబాద్ జిల్లా రంజన్ల తయారీకి పెట్టింది పేరు. నీటిని చల్లబరచడంలో ప్రత్యేకత కలిగినవి కావడం, ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో గిరాకీ బాగుంటుంది. వీటి తయారీని కుమ్మరులు ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తారు. వీటిపై ఆధారపడి జిల్లాలో వందల సంఖ్యలో జీవనం సాగిస్తున్నాయి. వీటి తయారీలో కుమ్మరుల కళ, నైపుణ్యం ఉట్టిపడుతుంది. రంజన్లు విభిన్న రూపాల్లో, యంత్రాలకు దీటుగా తయారై ఆకట్టుకోవడంతో భలే గిరాకీ ఉంటుంది.
Similar News
News September 11, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయని ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జాగ్రామ్ తెలిపారు. 2025 జూన్, జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ 2వ సంవత్సరం, 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. https://online.braou.ac.in/UGResults/cbcsResults అనే వెబ్సైట్ను సందర్శించి ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.
News September 11, 2025
అంబేడ్కర్ వర్సిటీలో చేరేందుకు రేపే ఆఖరు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 12వ తేదీ వరకు గడువు ఉందని సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత, ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జగ్రామ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గిరిజనులకు ఉచితంగా విద్య అందించే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News September 11, 2025
ADB: గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

శిశు మరణాలను తగ్గించాలంటే గర్భిణులకు సరైన పర్యవేక్షణ, ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం అవసరమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లాలో శిశు మరణాల రేటును ఒక అంకెకు తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 15గా ఉన్న శిశు మరణాల రేటును 10 కన్నా తక్కువకు తీసుకురావడానికి వ్యూహాలను రూపొందించాలని పేర్కొన్నారు.