News December 29, 2025

రంపచోడవరం: కొత్త జిల్లాకు పరిపాలనకు అవసరమైన భవనాలు కష్టమే.?

image

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా పేరిట నూతన జిల్లాకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే రంపచోడవరం కేంద్రంలో పరిపాలన కోసం అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు కష్టతరంగా ఉండనుంది. ప్రస్తుతానికి వైటీసీ, పీఎంఆర్సీ భవనాలలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని శాఖల కార్యాలయాలకు భవనాలు ఏర్పాటు స్థానిక అధికారులకు తలనొప్పిగా మారనుంది.

Similar News

News January 1, 2026

భద్రాద్రి కొత్తగూడెం: టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టెట్‌ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షాకేంద్రాల ఎంపిక, బందోబస్తు, విద్యుత్‌ సరఫరా అంశాలపై ఆరా తీశారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యాచందనలకు విధులను కేటాయిస్తూ, అక్రమాలకు తావులేకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

News January 1, 2026

భద్రాద్రి: విద్యార్థులకు అలర్ట్.. స్కాలర్‌షిప్ గడువు పెంపు.!

image

విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉపకార వేతనాల దరఖాస్తు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, రిన్యూవల్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు. ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News January 1, 2026

జనవరి 1: చరిత్రలో ఈరోజు

image

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం