News September 22, 2025
రంపచోడవరం: గ్రీవెన్స్‌లో 98 అర్జీలు

రంపచోడవరం ITDA కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 98 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. PO. స్మరణ్ రాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్నిటిని అక్కడే పరిష్కరించారు. మిగిలినవి సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించారని పేర్కొన్నారు. ప్రతీ అర్జీని బాధ్యతయుతంగా పరిష్కరించాలని PO ఆదేశించారు.
Similar News
News September 22, 2025
యాదాద్రి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదైంది. హనుమాన్ ఐటీ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న వలిగొండ వాసి కల్లోజ్ ప్రేమ కుమార్‌పై సెక్షన్ 318(4), 316(2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు. నిందితుడు నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగార్థులను మోసగిస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
News September 22, 2025
హనుమకొండ ప్రజావాణిలో 157 విజ్ఞప్తులు

HNK కలెక్టరేట్‌లో సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ 157 వినతులను అందజేశారని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.
News September 22, 2025
మేడ్చల్: ప్రజావాణిలో 95 ఫిర్యాదుల స్వీకరణ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, DRO హరిప్రియతో కలిసి రాధికగుప్తా 95 దరఖాస్తులు స్వీకరించారు. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.