News October 28, 2025

రంపచోడవరం: ఘాట్ రోడ్డులో భారీ వాహనాలు నిలిపివేత

image

తుఫాన్ నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. డి.ఎస్.పి సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను రంపచోడవరం మండలం ఐ.పోలవరం వద్ద మంగళవారం మళ్లిస్తున్నామని సీఐ సన్యాసినాయుడు తెలియజేశారు. తుఫాన్ తగ్గుముఖం పట్టే వరకు భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలన్నారు.

Similar News

News October 28, 2025

తీరాన్ని తాకిన తుఫాను.. 8-10 గం.లు జాగ్రత్త

image

AP: మొంథా తుఫాను కాసేపటి క్రితం <<18132869>>తీరాన్ని తాకింది<<>>. రాబోయే 8-10 గం. భారీ వర్షాలు, గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10CM-20CM వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 6-7 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందన్నారు.

News October 28, 2025

సూర్యాపేట: పోలీస్ వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

బాధితులకు వేగవంతంగా పోలీసు సేవలు అందించడంలో పోలీసు వాహనాలు కీలకమని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు వాహనాల నాణ్యతను, కండిషన్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించే వాహనాలు పూర్తి కండిషన్లో ఉండాలని, వాటిని ఎక్కువ కాలం ఉపయోగించేలా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారిని ఆదేశించారు.

News October 28, 2025

వనపర్తి: బాల్యవివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు

image

వనపర్తి జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ గిరిధర్‌తో కలిసి జిల్లా స్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.