News November 25, 2025

రంపచోడవరం జిల్లాకు గ్రీన్ సిగ్నల్..?

image

YCP ప్రభుత్వంలో రంపచోడవరం, అరకు, పాడేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరుకు రావాలంటే వందలాది కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇక్కడి ప్రజలు రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబు దీనిపై సమీక్ష చేయనున్నారు.

Similar News

News November 25, 2025

వరంగల్ సీపీగా అవినాశ్ మహంతి..?

image

వరంగల్ సీపీగా అవినాశ్ మహంతిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొందరికి మింగుడు పడటం లేదని సమాచారం. ప్రభుత్వం మాత్రం లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెట్టేందుకు ఈ మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీస్ గ్రూపులు, సోషల్ మీడియాలో చర్చగా మారింది. అయితే ఐజీ స్థాయి అధికారి వరంగల్‌‌‌కు వచ్చే అవకాశం ఉందా? అని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

News November 25, 2025

నక్కపల్లి: పెన్సిల్ ముల్లుపై అయ్యప్ప స్వామి

image

నక్కపల్లిలోని చిన్న దొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై అయ్యప్ప స్వామి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. చార్కోల్ పెన్సిల్ ముల్లుపై 16 మి.మీ పొడవు, 8మి.మీ వెడల్పున అయ్యప్ప స్వామిని తయారు చేశారు. తయారు చేసేందుకు తనకు 6 గంటల సమయం పట్టిందని వెంకటేశ్ తెలిపారు.

News November 25, 2025

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

image

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.