News December 22, 2025

రంపచోడవరం జిల్లాలో పోలవరం కలపాలని ‘మన్యం బంద్’

image

రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని కలపాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు సోమవారం ‘మన్యం బంద్’ నిర్వహించాయి. బుట్టాయగూడెం ఏజెన్సీ నుంచి రంపచోడవరం వరకు వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పోలవరం లేకుండా జిల్లా చేయడం వల్ల ప్రయోజనం లేదని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. బంద్ కారణంగా రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు.

Similar News

News December 23, 2025

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు?

image

IPLతో పాటు WPLలో ఢిల్లీ జట్లకు కెప్టెన్లు మారనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. IPLలో గత సీజన్‌లో DCకి అక్షర్ సారథ్యం వహించగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. దీంతో కెప్టెన్సీ తీసుకోవాలని రాహుల్‌ను ఫ్రాంచైజీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లోనే సారథిగా చేయాలని భావించినా ఆయన ఆసక్తి చూపలేదు. అటు WPLలో మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా తప్పించి జెమీమాకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

News December 23, 2025

ధనుర్మాసం: ఎనిమిదో రోజు కీర్తన

image

‘తూర్పున తెలవారింది. గేదెలు మేతకు వెళ్లాయి. కృష్ణుడిని చేరుకోవాలని గోపికలంతా ఓచోట చేరి, నిద్రపోతున్న నిన్ను మేల్కొల్పుతున్నారు. కేశి అనే అసురుణ్ణి, చాణూర ముష్టికులను అంతం చేసిన వీరుడి సన్నిధికి అందరం కలిసి వెళ్దాం పద! మనకంటే ముందే ఆయన వస్తే బాగుండదు. మనమే ముందెళ్లి ఎదురుచూస్తే ఆయన సంతోషంతో మన కోరికలను వెంటనే నెరవేరుస్తారు. ఆలస్యం చేయక లే, కృష్ణ పరమాత్మను కొలిచి నోము ఫలాన్ని పొందుదాం’.<<-se>>#DHANURMASAM<<>>

News December 23, 2025

30 దేశాల్లో అమెరికా రాయబారుల తొలగింపు

image

30 దేశాల్లోని తమ రాయబారులను తొలగిస్తూ US అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వీరంతా బైడెన్‌ హయాంలో నియమించిన వారు కావడం విశేషం. అధ్యక్షుడు ట్రంప్ ఎజెండా(అమెరికా ఫస్ట్)కు అనుగుణంగా పని చేసే ఉద్దేశంతో వీరి స్థానంలో కొత్తవారిని నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలగించినవారిలో నేపాల్, శ్రీలంక, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల రాయబారులున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో పలు ఒప్పందాలు మారనున్నాయి.