News August 26, 2025

రంపచోడవరం: డిగ్రీ అడ్మిషన్లు నేడే చివరి తేదీ

image

రంపచోడవరం మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ అడ్మిషన్లకు నేడే చివరి తేదీ అని ప్రిన్సిపల్ డా.కె. వసుధ తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బొటని, జువాలజీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ మొత్తంగా ఏడు మేజర్ సబ్జెక్టులు కళాశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు కళాశాలలో ఆన్‌లైన్ ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు.

Similar News

News August 26, 2025

టారిఫ్స్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మొదలైన మార్కెట్స్

image

భారత స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి 50% టారిఫ్స్ అమల్లోకి రానుండటం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ 574 పాయింట్ల నష్టంతో 81,061, నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,793 వద్ద ట్రేడవుతున్నాయి. బజాజ్ ఆటో, HUL, హీరో మోటోకార్ప్, TCS లాభాల్లో ఉండగా టాటా స్టీల్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, భారత్ ఎలక్ట్రిక్, ICICI బ్యాంక్, Airtel నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News August 26, 2025

BCCI స్పాన్సర్‌గా TOYOTA?

image

టీమ్ఇండియా స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను BCCI తప్పించిన విషయం తెలిసిందే. దీంతో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు జపాన్ ఆటోమేకర్ టయోటా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ కూడా స్పాన్సర్‌షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు BCCI అధికారిక బిడ్డింగ్ మొదలుపెట్టలేదు. అటు SEP 9న మొదలయ్యే ఆసియా కప్‌లోపు స్పాన్సర్ దొరకడం దాదాపు కష్టమే.

News August 26, 2025

వరంగల్: SI నంబర్ నుంచి అనుమానాస్పద ఏపీకే ఫైల్స్

image

పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ పేరుతో పలు వాట్సప్ గ్రూపుల్లో WGL జిల్లా నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ నంబర్ నుంచి అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ షేర్ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఫైల్స్‌ను గమనించినవారు వెంటనే ఇది సైబర్ నేరస్థుల పనై ఉంటుందని గుర్తించి ఇతరులను అలర్ట్ చేశారు. పోలీసుల ఫోన్ నంబర్లను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారనేది ఇక్కడ మరోసారి రుజువైంది.