News October 29, 2025

రంపచోడవరం: ’54మంది గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు’

image

తుఫాన్ నేపథ్యంలో ఈనెలలో ప్రసవాలకు సిద్ధంగా ఉన్న 54 మంది గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకు మంగళవారం చేర్చడం జరిగిందని రంపచోడవరం అడిషినల్ DM&HO డా.సరిత తెలిపారు. వారిలో 14 మందిని PHCలు, ఐదుగురుని CHC ఆసుపత్రులు, 33 మందిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రుల్లో చేర్చడం జరిగిందన్నారు. అన్ని CHCల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు.

Similar News

News October 29, 2025

భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

image

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.

News October 29, 2025

అర్ష్‌దీప్ బదులు హర్షిత్.. నెటిజన్ల ఆగ్రహం

image

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ బదులు హర్షిత్ రాణాను ప్లేయింగ్-11లోకి తీసుకోవడంపై నెటిజన్లు టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. హర్షిత్‌కు గంభీర్ సపోర్ట్ ఎక్కువగా ఉందని, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 29, 2025

వికారాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- స్పీకర్

image

తుఫాను ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రైతులు పొలాల వద్దకు వెళ్లరాదని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.