News October 11, 2024

రంప: ఆకట్టుకుంటున్న పెద్ద పుట్టగొడుగు

image

రంపచోడవరం నియోజకవర్గం విఆర్‌పురం మండలం ఉమ్మిడివరం గ్రామంలో భారీ పుట్టగొడుగు ఆకట్టుకుంటుంది. సాధారణంగా పుట్ట గొడుగు 2 నుంచి 4 అంగుళాలు ఎత్తుకు ఎదిగింది. ఈ పుట్ట గొడుగు 2 అడుగులు ఎత్తు, 3 అడుగుల వెడల్పు గులాబీ రంగులో, ఎరుపు మచ్చలతో ఆకర్షనీయంగా ఉంది. స్థానికులు పుట్ట గొడుగుని ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ భారీ పుట్ట గొడుగు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 11, 2024

తూ.గో: పిడుగులు పడే ప్రమాదం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు పిడుగుల ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ రూరల్, తుని, కోనసీమ, పెద్దాపురం, సామర్లకోట, రంపచోడవరం, మారేడుమిల్లి, రాజానగరం రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో పిడుగులు ప్రమాదం ఉందని ఫోన్‌లకు రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.

News October 11, 2024

తుని: చెరువులో మద్యం సీసాలు.. ఎగబడిన మద్యం ప్రియులు

image

తుని మండలం రాపాక శివారు చెరువులో 10 నుంచి 15 మూటల్లో మద్యం సీసాలు ఉండటంతో గురువారం స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. చెరువులో మద్యం ప్రియులు సీసాలను గంటల వ్యవధిలోనే తీసుకుపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేపట్టారు. 2 రోజుల క్రితం కేఒ మల్లవరంలో మద్యం కేసులో నలుగురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారు భయపడి మద్యం సీసాలు చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

News October 10, 2024

చింతూరు: జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు మావోయిస్టులు

image

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇరువురు మావోయిస్టు దళ సభ్యులు ASP పంకజ్ కుమార్ మీనా ఎదుట గురువారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముచ్చిక అయిత, మడకం హింగే ఉన్నారని అధికారులు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. లొంగిపోయిన వారిని పోలీస్ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. మావోయిస్టులు ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం తరుపు నుంచి అన్ని రాయితీలు కల్పిస్తామని ASP అన్నారు.