News September 5, 2025
రంప: ‘గురువు దైవంతో సమానం’

రంపచోడవరం మీటింగ్ హల్‌లో గురుపూజోత్సవం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా PO. సింహాచలం మాట్లాడుతూ.. ప్రతీ మనిషి ఎదుగుదల వెనుక టీచర్ పాత్ర ప్రధానంగా ఉంటుందని అన్నారు. గురువు దైవంతో సమానం అన్నారు. డివిజన్ స్థాయిలో 22 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, అవార్డ్స్‌ను అందజేశారు. ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు, టీచర్స్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 5, 2025
స్కాంల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం: జగన్

AP: ప్రజల ఆస్తులను CM చంద్రబాబు తనవాళ్లకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను స్కాంల కోసం ప్రైవేటుపరం చేస్తున్నారు. మా 5ఏళ్లలో 17కాలేజీల్లో 5చోట్ల క్లాసులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు మీరు బాధ్యతగా చేసి ఉంటే మరో 12 కాలేజీల్లోనూ క్లాసులు స్టార్ట్ అయ్యేవి. మేం అధికారంలోకి రాగానే ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’ అని ట్వీట్ చేశారు.
News September 5, 2025
జగిత్యాల: KCRను తిట్టడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు: కొప్పుల

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, KCRను తిట్టడం తప్ప CM రేవంత్ రెడ్డికి వేరే పని లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈరోజు జగిత్యాలలోని BRS ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో వరద బాధితులకు ఏం చేస్తారో చెప్పకుండా KCRను తిట్టడమేంటని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారన్నారు. విద్యాసాగర్ రావు, దావ వసంత ఉన్నారు.
News September 5, 2025
HYD: రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్న వెంకన్న

తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డా.గడ్డం వెంకన్న ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్నారు. శుక్రవారం HYDలోని శిల్పారామంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో VC ఆచార్య నిత్యానందరావు పాల్గొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ అధ్యాపకులు, ఉమ్మడి జిల్లా నేతలు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.