News November 5, 2025

రంప: చెకుముకి జిల్లా పోటీలకు 42 మంది

image

అల్లూరి జిల్లాలో 14 ఉన్నత పాఠశాలల నుంచి 42మంది విద్యార్థులు చెకుముకి సైన్స్ పోటీలకు ఎంపికయ్యారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బొజ్జయ్య బుధవారం తెలిపారు. రంపచోడవరంలో విజేతలకు బుధవారం సర్టిఫికెట్స్ అందజేశారు. రంపచోడవరంలో ఈనెల 23న జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో వీరంతా పాల్గొంటారని వెల్లడించారు. ఈ పోటీలకు ఆదరణ పెరిగిందని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు.

Similar News

News November 5, 2025

తిరుపతి: వారి ఇళ్లకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు

image

APSPDCL పరిధిలోని 9జిల్లాల్లో 100మంది విద్యుత్ ఉద్యోగుల ఇళ్లకు ప్రయోగాత్మకంగా ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చి అధ్యయనం చేయాలని CMD శివశంకర్ అధికారులను ఆదేశించారు. ఈ-వ్యాలెట్ రీఛార్జింగ్, SMS అలెర్ట్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇది సక్సెస్ అయితే అందరి ఇళ్లకు వీటిని అమర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొబైల్ రీఛార్జ్‌లాగా చేసుకుంటే అందులోనే కరెంట్ బిల్లు కట్ అవుతుంది.

News November 5, 2025

జుక్కల్: పత్తి కూలీల కొరత.. రైతుల్లో గుబులు!

image

జుక్కల్ నియోజకవర్గంలో పత్తి రైతులకు కూలీల కొరత సమస్యగా మారింది. నియోజకవర్గంలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, పిట్లం మండలాల్లో సాగు చేసిన పత్తి కోత దశకు చేరుకుంది. అయితే, కూలీలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో పత్తి తీతకు రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లించినా, కూలీలు అందుబాటులో లేరు. అకాల వర్షాల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 5, 2025

‘అల్లూరి జిల్లాలో హోం పర్యాటకం విజయవంతం చేయాలి’

image

జిల్లాలో హోం పర్యాటకం విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. బుధవారం పాడేరు ITDAలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, పీఎం జుగా పథకం కింద జిల్లాలో ఇప్పటికే 150 గృహాలకు హోంస్టే కోసం అనుమతులు లభించాయన్నారు. 40 లక్షల గడప ఉన్న జిల్లాలో 40 వేల హోంస్టేలు ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.