News December 10, 2025

రంప: డిప్యూటీ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసు?

image

రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్యకు ITDA పీవో స్మరణ్ రాజ్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోకవరం పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం వార్డెన్‌గా పని చేస్తున్న సంబుడును పీఓ అనుమతి లేకుండా రంపచోడవరం సహాయ గిరిజన సంక్షేమాధికారిగా నియమించినందుకుగాను నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి ITDA POకు ఫిర్యాదు చేయడంతో నోటీసు అందజేశారని తెలిసింది.

Similar News

News December 14, 2025

NTR: సామాజిక మాధ్యమాల్లో తెలుగు తమ్ముళ్ల కొట్లాట.!

image

తిరువూరు నియోజకవర్గంలో MP, MLA వర్గీయుల మధ్య మరోసారి మనస్పర్ధలు భగ్గుమన్నాయి. MLA ఓ మండల అధ్యక్షుడిని ఉద్దేశించి “పేకాట క్లబ్ కింగ్” అని స్టేటస్ పెట్టగా, వ్యతిరేక వర్గం ఓ మహిళతో MLA సన్నిహితంగా ఉన్నట్లు ఒక ఫొటోను విడుదల చేసింది. ఇది AI ఫొటో అని, ఒరిజినల్ అని ఇరువర్గాలు వాట్సాప్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై MLA ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.

News December 14, 2025

ఖమ్మం జిల్లాలో ‘కిక్’ ఎక్కిస్తోన్న జీపీ ఎన్నికలు..!

image

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం మధ్య, గత 13 రోజుల్లో వైరా డిపో నుంచి రూ. 130 కోట్ల విలువైన 1.59 లక్షల కేసుల మద్యం, 56 వేల కేసుల బీర్లు తరలించారు. ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడంతో అటు వ్యాపారులకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.

News December 14, 2025

బి.కొత్తకోట: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది వీరే.!

image

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని శనివారం బి.కొత్తకోట బాలికల హైస్కూల్‌లో మండల స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు జరిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన పోటీల్లో మానస, వక్తృత్వ పోటీల్లో నవదీప్ రెడ్డి, క్విజ్ పోటీల్లో నవదీప్ రెడ్డి సత్తా చాటారని MEOలు రెడ్డిశేఖర్, భీమేశ్వరాచారి తెలిపారు. వీరు రాయచోటిలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొటారన్నారు.