News March 15, 2025
రంప : పడిపోయిన టమాటా ధర

ఆరుగాలాలు కష్టపడి పంట పండించిన రైతుకు తన కష్టానికి తగిన మద్దతు ధర కూడా రాని పరిస్థితి నేడు నెలకొంది. అల్లూరి జిల్లాలో టమాటా రేటు బాగా పడిపోయింది. రంపచోడవరం పరిసర గ్రామాల్లో శనివారం హోల్ సేల్ మార్కెట్లో 10 కిలోలు టమాటా రూ. 100 పలికింది. రిటైల్ గా రూ.150 మాత్రమే పలికింది. ఈ సీజన్ దిగుబడి పెరిగి ఒకే సారి పంట మార్కెట్టుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు.
Similar News
News March 17, 2025
1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది. తాజాగా పలువురు నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి సజ్జనార్ తోడవ్వడంతో ప్రమోటర్స్‌పై ప్రభుత్వం చర్యలకు దిగింది.
News March 17, 2025
వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అత్యధికంగా కానాయిపల్లిలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెబ్బేరు 42.1, విలియంకొండ 41.6, పెద్దమందడి 41.1, వనపర్తి 40.7, రేమద్దుల 40.7, గనపూర్ 40.4, వెలుగొండ 40.4, రేవల్లి 40.3, ఆత్మకూర్ 40.3, మదనపూర్ 39.9, దగడ 39.9, పాన్గల్ 39.6, సోలిపూర్ 39.6, గోపాల్ పేట 39.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 17, 2025
భద్రత పెంచుతాం.. డీకే అరుణకు సీఎం హామీ

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ <<15780375>>ఇంట్లో ఆగంతకుడు<<>> ప్రవేశించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని ఆమెకు హామీకి ఇచ్చారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను సీఎం ఆదేశించారు. భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.