News December 26, 2025
రంప: ప్రమాదాలు జరిగాక పోలీసుల చర్యలు!

రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండు నెలలుగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మారేడుమిల్లి ఘాట్ రోడ్డు లో బస్సు లోయలో పడితే ఆ తరువాత ఘాట్ రోడ్ పై రాత్రి వేళలు రాకపోకలు నిలిపివేశారు. బుధవారం వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురు చనిపోవడంతో ప్రస్తుతం విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు.
Similar News
News December 30, 2025
నాన్న లేని లోకంలో ఉండలేక.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన

TG: తల్లి చిన్నప్పుడే దూరమవడంతో తండ్రే లోకంగా పెరిగాడు నితిన్. తండ్రి నాగారావు అమ్మలా గోరుముద్దలు తినిపించాడు. ఫ్రెండ్స్‌లా ప్రతి విషయం షేర్ చేసుకునేవారు. అలాంటి తండ్రి 3 రోజుల క్రితం మృతిచెందడంతో తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియల తర్వాత ఇంటి నిండా నిశ్శబ్దం అతడిని మరింత కుంగదీసింది. నాన్న లేని లోకంలో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా బాసరలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
News December 30, 2025
రాష్ట్రంలోనే పెద్ద జిల్లాగా తిరుపతి

జిల్లాల పునర్విభజన తర్వాత జనాభా పరంగా తిరుపతి అతిపెద్ద జిల్లాగా అవతరించింది. గతంలో 4 డివిజన్లు, 34 మండలాలు, 29, 04,254 మంది జనాభాతో జిల్లా ఉండేది. తాజా మార్పులతో జిల్లాలో 3 డివిజన్లు, 36 మండలాలు ఉన్నాయి. జనాభా 29,47,547కు పెరిగింది. మండలాల పరంగా కడప(40) టాప్‌లో ఉండగా తిరుపతి జిల్లా 2వ స్థానంలో ఉంది. రైల్వేకోడూరులోని మంగంపేట ముగ్గురాయి గనులు తిరుపతిలోకి రావడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
News December 30, 2025
డేంజర్‌లో హైదరాబాద్

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ మంగళవారం తెల్లవారుజామున 285కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈసమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT


