News January 7, 2026

రక్తమే రంగుగా.. జగన్ చిత్రపటం గీసిన అభిమాని!

image

ధవళేశ్వరానికి చెందిన కళాకారుడు మిరప రమేష్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా రమేష్ తన రక్తంతో ఆయన చిత్రపటాన్ని గీసి తన అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు చొరవతో తాడేపల్లిలో జగన్‌ను కలిసిన రమేష్.. తాను గీసిన చిత్రాన్ని స్వయంగా చూపించారు. యువకుడి ప్రతిభను, అభిమానాన్ని చూసి ముచ్చటపడ్డ జగన్.. అతడిని ఆత్మీయంగా పలకరించి అభినందనలు తెలిపారు.

Similar News

News February 21, 2026

అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ , అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.

News February 21, 2026

ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

image

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్‌ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.

News February 21, 2026

బాన్సువాడలో ప్రశాంతత.. పుకార్లను నమ్మవద్దు: SP

image

బాన్సువాడలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని KMR జిల్లా SP రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి, లోతైన దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని SP పేర్కొన్నారు. శాంతికి విఘాతం కలిగించే వారి పట్ల రాజీపడబోమని స్పష్టం చేశారు.