News October 2, 2024

రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో ఉన్న నడిమి వంకను కలెక్టర్ వినోద్ కుమార్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత.. అధికారులతో కలిసి పరిశీలించారు. వంకకు రెండువైపులా ఉన్న ఆదర్శ నగర్‌తో పాటు సుమారు 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించారు. రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Similar News

News March 1, 2026

గుత్తి: వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ ప్రారంభం

image

రైల్వే ఇన్స్టిట్యూట్లో అందరికీ ఉపయోగపడే విధంగా వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్‌ను ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ కం ఏడీఎంఈ అశోక్ గౌడ్, సెక్రెటరీ నయాబ్ రసూల్ చాట్ బాట్ సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైల్వే ఇన్స్టిట్యూట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి, రూమ్స్‌ను బుక్ చేసుకోవడానికి 9652793707 వాట్సాప్ నంబర్ ద్వారా చేసుకొనే అవకాశాన్ని కల్పించామన్నారు.

News February 28, 2026

అనంత: హాకీలో సత్తా చాటిన యువకుడు యువన్ క్రిష్

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్‌లో యువకుడు యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువన్ క్రిష్ అండర్ 10 హాకీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News February 28, 2026

కార్డుదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాలకు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం & సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. కార్డుదారులు తమకు దగ్గరలో ఉన్న ఏ చౌక ధరల దుకాణం వద్దనైనా నిత్యావసర సరుకులను పోర్టబిలిటీ ద్వారా పొందవచ్చన్నారు.