News November 11, 2025

రక్షణ చట్టం వచ్చేవరకు మా అడుగులు ఆగవు- న్యాయవాదుల

image

న్యాయవాదుల భద్రత దేశ న్యాయవ్యవస్థ గౌరవానికి మూలం. రక్షణ చట్టం అమలు అయ్యే వరకు మా అడుగులు ఆగవు అని న్యాయవాద సంఘ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం గవ్వల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘న్యాయవాదుల రక్షణ – చలో హైదరాబాద్’ పాదయాత్ర మూడో రోజు బీచుపల్లి శ్రీరామాలయం ప్రాంగణంలో ప్రార్థనలతో ప్రారంభమైంది. ‘న్యాయవాది రక్షణ చట్టం – ఇప్పుడే అమలు చేయాలి’ అంటూ పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు.

Similar News

News November 11, 2025

HYD: మరో 10 రాష్ట్రాలకు విస్తరించనున్న సింగరేణి

image

సింగరేణి కంపెనీ 10 రాష్ట్రాలకు కార్యకలాపాలను విస్తరించి, సింగరేణి గ్రీన్ ఎనర్జీ, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ ద్వారా 5,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థగా మారనుందని HYDలో ఎండీ బలరాం వెల్లడించారు. 40,000 మంది ఉద్యోగులు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆధారపడి ఉన్న సింగరేణి భవిష్యత్తు శతాబ్దం పాటు సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపట్టారు.

News November 11, 2025

కర్నూలు జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన షెడ్యూల్..!

image

ఈ నెల 12న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై NIA అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.