News April 14, 2025
రఘునాథపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని గోవర్ధనగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ముందున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ ఐనప్పటికీ డ్రైవర్ మృతి చెందాడు. కారు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలు కూడా అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 20, 2025
నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పోలీస్ సేవలు అందుబాటులో ఉన్నట్లు SP డా.అజిత వేజెండ్ల తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9552300009 మనమిత్ర వాట్సాప్ సేవలను అందబాటులోకి తెచ్చిందన్నారు. ఈ-చలానా చెక్, ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్, కేసు స్థితిగతులను తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు. దీని వలన ప్రజల సమయం ఆదాకావడంతోపాటు ప్రజలకు పోలీసులు మరింత చేరువవుతారు.
News December 20, 2025
KNR: ఎన్నికల విధులకు గైర్హాజరు.. 713 మందికి నోటీసులు

గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు విడతల్లో జరిగిన పోలింగ్‌కు పీఓ, ఏపీఓలుగా నియామకమైనా, ముందస్తు అనుమతి లేకుండా వీరు విధులకు రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
News December 20, 2025
అభివృద్ధి చిరునామా ORR.. ఇప్పుడు అమరావతి వంతు!

HYD అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్(ORR)ది కీలక పాత్ర. కనెక్టివిటీ పెరగడంతో నివాస, వాణిజ్య సముదాయాలు పెరిగాయి. ఇప్పుడు నూతనంగా ఎదుగుతున్న AP <<18624817>>రాజధాని<<>> అమరావతి ORRకు అడుగులు పడుతున్నాయి. ఇది పూర్తయితే 5 జిల్లాల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్‌కు ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. అయితే భూసేకరణకు ప్రజల సహకారం ఎలా ఉంటుంది? ఎప్పటికి పూర్తవుతుందనేదే ప్రశ్న!


