News April 15, 2025
రజతోత్సవ సభతో వరంగల్‌లో BRS ఊపందుకోనుందా?

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS, మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సభతో జిల్లాలో మళ్లీ BRS ఊపందుకోనుందా? కామెంట్
Similar News
News April 16, 2025
వరంగల్: రైలు నుంచి జారి పడి యువకుడి మృతి

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. శివనగర్‌కు చెందిన అనిల్(29) వరంగల్ నుంచి రామగుండం కూలి పని కోసం కోర్బా రైలు ఎక్కాడు. పాత వరంగల్ రైల్వే గేట్ సమీపానికి చేరుకోగానే ప్రమాదవశాత్తు అతడు రైలు నుంచి జారిపడ్డాడు. అతడి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలవగా ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 16, 2025
వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్‌కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
News April 16, 2025
నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదాం: కలెక్టర్

నకిలీ విత్తనాలను సమన్వయంతో అరికడదామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. మంగళవారం శివనగర్‌లోని ఓ కన్వెన్షన్ హలులో విత్తనాలు, ఎరువుల, క్రిమిసంహారక మందుల కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ అంకిత్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అనురాధతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. నకిలీ పురుగుల మందులు అమ్మితే పీడీ యాక్టు నమోదుతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.