News April 15, 2025

రజతోత్సవ సభతో వరంగల్‌లో BRS ఊపందుకోనుందా?

image

ఈనెల 27న WGL జిల్లాలో BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 2018 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 BRS కైవసం చేసుకోగా.. ములుగు, BHPL కాంగ్రెస్ గెలిచింది. 2023లో అది కాస్తా తారుమారుగా జనగామ, స్టే.ఘ మాత్రమే BRS గెలిచి.. మిగతావన్నీ కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు BHPL MLA కాంగ్రెస్ నుంచి BRSలో, ఇప్పుడు స్టే.ఘ MLA BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సభతో జిల్లాలో మల్లీ BRS ఊపందుకోనుందా?

Similar News

News February 24, 2026

భూపాలపల్లి జిల్లాలో 8.4 మి.మీల వర్షపాతం నమోదు

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 8.4 మి.మీల వర్షపాతం నమోదైంది. టేకుమట్ల మండలంలో అత్యధికంగా 6.2 మి.మీలు, రేగొండ మండలంలో 2.2 మి.మీల వర్షం కురిసింది. మహాదేవ్‌పూర్, పలిమెల, కాటారం, రేగొండ తదితర మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీలుగా నమోదైనట్లు సీపీఓ కార్యాలయం వెల్లడించింది.

News February 24, 2026

నల్గొండ: అన్నదాతకు ‘స్మార్ట్’ ఫోన్ కష్టాలు

image

యూరియా పంపిణీకి ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ యాప్ ఉమ్మడి NLG రైతుల పాలిట శాపంగా మారింది. స్మార్ట్‌ఫోన్లు లేక, ఓటీపీలు రాక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసేలోపే స్టాక్ నిండుకోవడం, యాప్‌లో చూపించినా డీలర్ల వద్ద బస్తాలు ఉండకపోవడంతో నిరాశ చెందుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. విసిగిపోయిన రైతులు.. యాప్‌ను రద్దు చేసి పాత పద్ధతిలో ఎరువులు అందజేయాలని రోడ్డెక్కుతున్నారు.

News February 24, 2026

గుంటూరు: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలైన తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొనుటకు బస్ సౌకర్యం అంశాలను అడిగారు.