News April 5, 2025

రజనీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం: అడ్వకేట్ జనరల్

image

స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి, డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి రజనీ, ఆమె మరిది గోపికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. ACB వేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని రజిని వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కేసులో రాజకీయ కారణాలు ఉన్నాయని రజనీ తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్, మహేశ్వర రెడ్డి వాదించారు.

Similar News

News April 5, 2025

కృష్ణా: బాబు జగ్జీవన్ రామ్‌కి కలెక్టర్ నివాళి  

image

దేశానికి అపార సేవలందించిన మహా నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం మచిలీపట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ, జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తోందన్నారు. 

News April 5, 2025

మునక్కాయల వల్ల ఎన్ని ప్రయోజనాలో.!

image

ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సీజనల్ ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను నియంత్రిస్తాయి. వీటిని తినటం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ‌మగవారిలో శృంగార సామర్థ్యానికి దోహదపడతాయి. వీటిలో ఉండే జింక్ ఆడవారికి నెలసరి సక్రమంగా వచ్చేలా సహకరిస్తుంది.

News April 5, 2025

రేషన్ బియ్యంతో సహపంక్తి భోజనం చేసిన మంత్రి, ఎమ్మెల్యే

image

రేషన్ షాపులో అందజేస్తున్న సన్నబియ్యం పేదింట్లో సంతోషం నింపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్‌పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేశారు. రాబోయే ఐదేళ్లు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

error: Content is protected !!