News March 31, 2025

రణస్థలం: అనుమానాస్పద స్థితిలో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

రణస్థలంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న పిన్నింటి అప్పలసూరి ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరిశ్రమలో ఉన్న వాష్ రూమ్‌లో ఉరివేసుకొని మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. మృతునిది నరసన్నపేట మండలం లుకలాం గ్రామం అని తెలిసింది. అయితే అప్పలసూరి మృతి పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

Similar News

News November 8, 2025

మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

image

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.

News November 8, 2025

టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

image

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

News November 8, 2025

శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

image

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.