News December 24, 2025
రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 27, 2025
శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్లలో 2,398 మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో మూడేళ్ల నుంచి రోడ్డు ప్రమాదాలలో 2,398 మంది మృతి చెందారు. 2023 – 810, 2024- 889, 2025లో ఇప్పటి వరకు 699 మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం 2026 మొదటి నెలను రోడ్డు భద్రత మాసంగా ప్రకటించింది. ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకపోవడంగా గుర్తించారు. వీటిని అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
News December 26, 2025
SKLM: గంజాయి రహిత జిల్లానే లక్ష్యం- ఎస్పీ

శ్రీకాకుళం జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే తమ లక్ష్యమని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్’ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 115 గంజాయి హాట్-స్పాట్లను గుర్తించామని, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఉంచామన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
News December 26, 2025
SRKLM: ప్రమాదాల కట్టడికి ఎస్పీ మాస్టర్ ప్లాన్!

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. మలుపుల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు.


