News March 1, 2026
రణస్థలం: మామకు తలకొరివి పెట్టిన కోడలు

రణస్థలం కాపువీధికి చెందిన కె.రామప్పడు అనే విశ్రాంత ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన కోడలు ఉమా మామ మృతదేహానికి తలకొరివి పెట్టింది. రామప్పడు భార్య చిన్నమ్మడు, కుమారులు అప్పన్న, రాంబాబు కొన్నాళ్ల క్రితం మృతిచెందగా అనారోగ్యానికి గురైన మామకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
Similar News
News March 4, 2026
SKLM: పారిశుద్ధ్యం పనులను పరిశీలించిన జేసీ

శ్రీకాకుళం నగరంలో డయేరియా నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను జిల్లా యంత్రాంగం ముమ్మరం చేసింది. జాయింట్ కలెక్టర్, ఇన్‌ఛార్జి నగరపాలక సంస్థ, ఇన్‌ఛార్జి కమిషనర్ అహ్మద్ ఫర్మాన్ ఖాన్ మంగళవారం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సెవెన్ రోడ్డు జంక్షన్‌లో ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. అనంతరం కాజీపేటలో జరిగిన పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించారు.
News March 3, 2026
జర్మనీ వెళ్తూ దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న సిక్కోలు వాసి

శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన పుట్రేవు వెంకట సత్య గౌతమ్ ఖతర్‌లోని దోహా ఎయిర్ పోర్టులో చిక్కుకున్నాడు. ఇతను బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, కంపెనీ ఆదేశాల మేరకు జర్మనీ ఫ్లైట్లో వెళ్తుండగా యుద్ధం వాతావరణం నెలకొనడంతో దోహా ఎయిర్ పోర్టులో విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన కుటుంబీకులకు తెలిపాడు.
News March 3, 2026
సిక్కోలు: మరి కాసేపట్లో క్లోజ్

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూతపడుతున్నాయి. ఈ విషయాన్ని ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు తెలిపారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మూత పడుతున్న ప్రముఖ దేవాలయాల జాబితాలో అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మనాథ ఆలయం, నారాయణ తిరుమల, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, శ్రీముఖలింగం తదితర దేవాలయాలు ఉన్నాయి. గ్రహణ త్యాగం అనంతరం ఆలయ సంప్రోక్షణ, భక్తులకు దర్శనాలు ఉంటాయన్నారు.


