News December 10, 2024
రణస్థలం: రెండు బైకులు ఢీ వ్యక్తి మృతి
రణస్థలంలోని పాత పెట్రోల్ బంకు సమీపంలో రెండు బైకులు ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు జె.ఆర్‌పురంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉద్యోగి తలసముద్రపు పాటయ్య(67) బంకులో పెట్రోల్ కొట్టేందుకు బైక్‌పై సోమవారం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లావేరు రోడ్డుకు వస్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో పాటయ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Similar News
News December 26, 2024
మెగాస్టార్‌తో అచ్చెన్నాయుడు మటామంతీ
మెగాస్టార్ చిరంజీవితో గురువారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముచ్చటించారు. శంషాబాద్‌లో జరిగిన ఒక వేడుకలో(మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహం)లో చిరంజీవి, అచ్చెన్నాయుడు కలుసుకున్నారు. ఒకరినొకరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. ఈ మేరకు చిరంజీవితో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారు.
News December 26, 2024
SKLM: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ ప్యాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.
News December 26, 2024
మందస: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పితాతొలి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పలాస నుంచి మందసకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సొండిపూడి లైన్ మేన్ జోగారావుతో పాటు మరో యువకుడు కిరణ్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు.