News April 6, 2024

రణస్థలం: 48 మంది వాలంటీర్లు రాజీనామా

image

రణస్థలం మండలం జే.ఆర్.పురం 1, 2 గ్రామ సచివాలయాల పరిధిలోని 48 మంది గ్రామ వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు వ్యతిరేకంగా శనివారం స్వచ్చందంగా రాజీనామా చేశారు. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి అమలు చేసి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

Similar News

News April 22, 2025

శ్రీకాకుళం: లారీ వెనుక భాగం ఢీకొని YSR విగ్రహం ధ్వంసం

image

రూరల్ మండలంలోని బైరి జంక్షన్‌లో వైఎస్ఆర్ విగ్రహం లారీ వెనుక భాగం ఢీకొనడంతో విధ్వంసానికి గురైందని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సోమవారం నరసన్నపేట నుంచి బైరి జంక్షన్ చేరుకున్న లారీ గంగమ్మ మోడ్రన్ రైస్ మిల్‌కు వెళ్తూ లారీని వెనుకకు తీసే క్రమంలో విగ్రహానికి ఢీకొంది.

News April 22, 2025

శ్రీకాకుళం: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

image

శ్రీకాకుళం జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

News April 22, 2025

శ్రీకూర్మం: పుణ్యక్షేత్రంలో.. పాపం చేసింది ఎవరు..?

image

శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ కూర్మనాధుని క్షేత్రంలో తాబేళ్లు మృతిచెందిన ఘటన సోమవారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాబేళ్లను ఆలయ శ్వేతపుష్కరని సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో పాపం చేసింది ఎవరు? తాబేళ్లు మృతిపై ఆలయ సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుక కారణాలు ఏంటి.. కారకులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

error: Content is protected !!